నామినేట్ చేయకపోవడంపై బాధేమీ లేదు : పంకజా ముండే
ABN , First Publish Date - 2020-05-09T20:45:44+05:30 IST
తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడంపై తనకెలాంటి బాధ లేదని బీజేపీ యువనేత పంకజా ముండే స్పష్టం
ముంబై : తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడంపై తనకెలాంటి బాధ లేదని బీజేపీ యువనేత పంకజా ముండే స్పష్టం చేశారు. మద్దతు దారులెవరూ కూడా నిరాశకు లోనుకాకూడదని ట్విట్టర్ వేదికగా ఆమె పిలుపునిచ్చారు. మనకందరికీ కూడా గోపీనాథ్ ముండే ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయంటూ ఆమె ట్విట్టర్‌లో పేర్కొంది. ‘‘మీలో ఉన్న నిరాశతో మీరు మా అమ్మ,సోదరికి ఫోన్ చేశారు. చెప్పడానికి ఏమీ లేదు కాబట్టి నేను జవాబివ్వలేదు. నేను నిరాశతో లేను. పార్టీ అభ్యర్థులకు శుభాకాంక్షలు.’’ అని ముండే ట్వీట్ చేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పంకజా ముండేకు అధిష్ఠానం టిక్కెట్ నిరాకరించింది. ఇక మరోవైపు, బీజేపీ సీనియర్ నేత ఏకనాథ్ ఖడ్సే కూడా అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనను ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రంజిత్ మోహితే, గోపిచంద్ పదల్కర్, ప్రవీణ్ ధట్కే, అజిత్ గోప్చడే ఈ నలుగుర్నీ బీజేపీ ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే.