మీకు పాన్ కార్డు ఉందా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

ABN , First Publish Date - 2020-03-02T18:58:13+05:30 IST

పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు గడువు మార్చి 31తో ముగియనుంది. ఈలోపు అనుసంధానం చేసుకున్న...

మీకు పాన్ కార్డు ఉందా.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

ఆధార్‌‌ అనుసంధానం కాని పాన్ కార్డు వాడితే రూ.10వేల వరకూ ఫైన్!

పాన్ కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు గడువు మార్చి 31తో ముగియనుంది. ఈలోపు అనుసంధానం చేసుకున్న వారి పాన్ కార్డులను మాత్రమే వినియోగానికి అనుమతిస్తారు. అనుసంధానం చేయని కార్డులను ఏప్రిల్ 1 నుంచి చెల్లనివిగా పరిగణిస్తారు.


అంతేకాదు, అనుసంధానం చేయని పాన్ కార్డును వినియోగించినట్లు తేలితే ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ అండర్ సెక్షన్ 272బీ కింద 10వేల వరకూ ఫైన్ విధించే అవకాశమున్నట్లు ఐటీ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే అనుసంధాన గడువును పన్నుల విభాగం రెండు సార్లు పొడిగించింది. గత సంవత్సరం సెప్టెంబర్‌లో ఒకసారి, డిసెంబర్‌లో మరోసారి గడువును పొడిగించిన నేపథ్యంలో మార్చి 31 తర్వాత గడువు పొడిగించే అవకాశాలు దాదాపుగా లేనట్టేనని తెలుస్తోంది.

Updated Date - 2020-03-02T18:58:13+05:30 IST