హోలీ వీక్‌ను ప్రారంభించిన పోప్ ఫ్రాన్సిస్

ABN , First Publish Date - 2020-04-06T00:17:36+05:30 IST

పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం సెయింట్ పీటర్స్ బసిలికాలో పామ్ సండే‌‌ను నిర్వహించారు.

హోలీ వీక్‌ను ప్రారంభించిన పోప్ ఫ్రాన్సిస్

వాటికన్ సిటీ : పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం సెయింట్ పీటర్స్ బసిలికాలో పామ్ సండే‌‌ను నిర్వహించారు. దీంతో ఈస్టర్ వరకు జరిగే హోలీ వీక్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఫ్రాన్సిస్ సాధారణంగా ఉపయోగించే ప్రధాన అల్టార్‌కు వెనుక ఉన్న సెకండరీ అల్టార్ నుంచి ఈ కార్యక్రమం జరిగింది. 


కరోనా వైరస్ మహమ్మారి పీడిస్తున్నందున ఈ కార్యక్రమంలో సుమారు 25 మంది మాత్రమే పాల్గొన్నారు. వీరంతా కోవిడ్ -19 నిబంధనల ప్రకారం  ఒకరికొకరు దూరం పాటించారు. ఈ ప్రదర్శన కొన్ని మీటర్ల దూరం వరకు సాగింది. కొన్ని ఆలివ్ చెట్లను వీరు చేబూనారు. 


ఈ ప్రదర్శనను టెలివిజన్ ఛానళ్ళు, ఇంటర్నెట్ ద్వారా లక్షలాది మంది వీక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చర్చిలలో ఇదేవిధంగా ఈ వారంలో కార్యక్రమాలు జరుగుతాయి.


పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ దైవం వైపు చూడాలని పిలుపునిచ్చారు. మహమ్మారి విషాదం నింపిన సమయంలో, చాలా బూటకపు రక్షణలు కుప్పకూలిన సమయంలో, చాలా ఆశలు నమ్మకద్రోహానికి గురైన సమయంలో, మన హృదయాలపై బరువెక్కిన త్యాగ భావనలో, మనం దైవం వైపు చూడాలన్నారు. భయం... సేవగా మారడానికి ఈ మహమ్మారి దోహదపడవచ్చునన్నారు.


వాటికన్ సిటీ స్వయంగా అష్ట దిగ్బంధనం పాటిస్తోంది. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా 15,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,25,000 మందికి కరోనా వైరస్ సోకింది. 


వాటికన్ సిటీలో ఏడుగురికి కరోనా వైరస్ సోకింది. పోప్ ఫ్రాన్సిస్‌తోపాటు ఆయనకు అత్యంత సన్నిహితులకు కరోనా వైరస్ నెగెటివ్ అని తేలింది.


Updated Date - 2020-04-06T00:17:36+05:30 IST