బిగ్ బాస్ హోస్ట్‌గా ఉండి రాజకీయాల్లోకా.. కమల్‌పై ఎడప్పాడి ధ్వజం..
ABN , First Publish Date - 2020-12-18T05:26:03+05:30 IST
ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యం చీఫ్ కమల్ హాసన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తీవ్ర స్థాయిలో ..

తిరుచ్చి: ప్రముఖ నటుడు, మక్కల్ నీధి మయ్యం చీఫ్ కమల్ హాసన్‌పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్‌గా ఉంటూ రాజకీయాల్లోకి ఎలా వస్తారంటూ ఆయన కమల్‌ను ప్రశ్నించారు. తిరుచ్చిలో ఇవాళ జరిగిన ఓ బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ... ‘‘70 ఏళ్ల వయసులో ఆయన (కమల్ హాసన్) బిగ్ బాస్‌కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు. బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా ఉన్న ఓ వ్యక్తి రాజకీయాల్లోకి ఎలా వస్తారు? ఆయన చేస్తున్న పని వల్ల అనేక కుటుంబాలు నాశనం అయ్యాయి. దాన్ని పిల్లలు చూస్తే పాడైపోతారు. మంచి కుటుంబాలు కూడా చెడిపోతాయి..’’ అని ఆరోపించారు. కాగా పళనిస్వామి నేతృత్వం వహిస్తున్న తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీని కూడా ప్రముఖ నటుడైన ఎంజీ రామచంద్రన్ ప్రారంభించారు. తర్వాత ఆ పార్టీని నడిపించిన జయలలిత కూడా నటనా నేపథ్యం నుంచి వచ్చిన వారే. ఆమె తమిళనాడుకు ఆరుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. కాగా వచ్చే ఏడాది తమళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం కమల్ హాసన్ ఆదివారం ప్రచారం ప్రారంభించిన విషయం తెలిసిందే