సరిహద్దుల్లో పాక్ కాల్పులు..భారత జవాన్ మృతి

ABN , First Publish Date - 2020-06-22T15:53:05+05:30 IST

పాకిస్థాన్ సోమవారం ఉదయం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.....

సరిహద్దుల్లో పాక్ కాల్పులు..భారత జవాన్ మృతి

జమ్మూ: పాకిస్థాన్ సోమవారం ఉదయం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్ లోని రాజౌరి, ఫూంచ్ జిల్లాల్లోని సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాక్ సైనికులు కాల్పులకు దిగారు. ఫూంచ్ జిల్లా కృష్ణగటి సెక్టారులోని సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున 3.30గంటలకు మోర్టార్ షెల్స్ తో కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో భారత జవాన్ ఒకరు అమరుడయ్యారు. మరోవైపు రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టారులో సోమవారం ఉదయం ఐదున్నర గంటలకు పాక్ సైనికులు కాల్పులు జరిపారు. పాక్ సైనికుల కాల్పులతో అప్రమత్తమైన భారత సైనికులు ఎదురుకాల్పులు జరిపి పాక్ యత్నాలను తిప్పికొట్టారు. పాకిస్థాన్ గత 15రోజుల్లోనే నాలుగుసార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైన్యం పాక్ కాల్పులను తిప్పికొట్టింది. పాక్ కాల్పులను భారత ఆర్మీ సమర్ధంగా తిప్పి కొట్టింది.

Updated Date - 2020-06-22T15:53:05+05:30 IST