గుట్టుచప్పుడు కాకుండా పాక్ ఏం చేసిందో తెలిస్తే..

ABN , First Publish Date - 2020-04-21T19:25:09+05:30 IST

మేమూ ఉగ్రవాద బాధితులమే అని తరచూ చెప్పుకునే పాకిస్థాన్ అవకాశం దొరికిన ప్రతిసారి వారికి ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో సహాయసహకారాలు అందిస్తూ ఉంటుంది. తాజాగా పాక్.. ఉగ్రవాద నిరోదక సంస్థ రూపొందించిన టెర్రరిస్టుల జాబితానుంచి దాదాపు 1800 మంది పేర్లను తొలగించిందని సమాచారం. కరుడుగట్టిన ఎల్ఈటీ ఉగ్రవాది జాకీ ఉర్ రహ్మాన్ పేరును కూడా పాక్ ఆ జాబితా నుంచి తీసేసినట్టు తెలిసింది.

గుట్టుచప్పుడు కాకుండా పాక్ ఏం చేసిందో తెలిస్తే..

ఇస్లామాబాద్: మేమూ ఉగ్రవాద బాధితులమే అని తరచూ చెప్పుకునే పాకిస్థాన్ అవకాశం దొరికిన ప్రతిసారి వారికి ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో సహాయసహకారాలు అందిస్తూ ఉంటుంది. తాజాగా పాక్.. ఉగ్రవాద నిరోదక సంస్థ రూపొందించిన టెర్రరిస్టుల జాబితానుంచి దాదాపు 1800 మంది పేర్లను తొలగించిందని సమాచారం. కరుడుగట్టిన ఎల్ఈటీ ఉగ్రవాది జాకీ ఉర్ రహ్మాన్ పేరును కూడా పాక్ ఆ జాబితా నుంచి తీసేసినట్టు తెలిసింది.


టెర్రరిజానికి నిధులు అందకుండా ఉండేందుకు పాక్ ఉగ్రవాద నిరోధక సంస్థ ఈ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో పేర్లు ఉన్న సంస్థలు, వ్యక్తులతో ఆర్థిక సంస్థలు ఎటువంటి లావాదేవీలు జరపవు. 2018నాటికి ఇందులో 7600 మంది పేర్లు ఉండగా.. గత 18 ఎనిమిది నెలల్లో 3800 పేర్లను పాక్ నిస్సంకోచండా తొలగించిందని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ టెక్నాలజీ కంపెనీ తెలిపింది. ఇక మార్చి నెల నుంచి ఇప్పటి వరకూ మరో 1800 మంది పేర్లును తొలగించినట్టు సమాచారం.


కాగా.. ఉగ్రవాదుల ఆర్థికపునాదుల్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్..పాక్‌లో ఉగ్రవాదకట్టడికి ఓ కార్యాచరణ ప్రణాలిక రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో మొత్తం 27 అంశాలు పేర్కొనగా.. 14 అంశాల్లో పాక్ పురోగతి సాధించిందని ఎఫ్ఏటీఎఫ్ గతంలో పేర్కొంది. పాక్ చర్యలపై సమీక్షించేందుకు ఎఫ్ఏటీఎఫ్ జూన్‌లో మరోసారి సమావేశమవనున్న నేపథ్యంలో తాజా పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం గ్రే లిస్టులో ఉన్న పాకిస్థాన్ చర్యల పట్ల ఎఫ్ఏటీఎఫ్ సంతృప్తి చెందని పక్షంలో సదరు సంస్థ పాక్‌ను బ్లాక్ లిస్టులో చేర్చే అవకాశం ఉంది.

Updated Date - 2020-04-21T19:25:09+05:30 IST