పాక్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం సడలింపు

ABN , First Publish Date - 2020-06-22T21:28:42+05:30 IST

కొవిడ్-19 కారణంగా మూడు నెలల నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ..

పాక్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం సడలింపు

ఇస్లామాబాద్: కొవిడ్-19 కారణంగా మూడు నెలల నుంచి నిలిచిపోయిన అంతర్జాతీయ విమాన సర్వీసులను పాక్షికంగా పునరుద్ధరిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర దేశాల్లో చిక్కుకున్న తమ ప్రజలను తిరిగి తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించింది. దేశంలో కొవిడ్-19 వ్యాప్తిని నిరోధించేందుకు తొలుత మార్చి 21 నుంచి రెండు వారాల పాటు అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం విధించిన పాకిస్తాన్.. తర్వాత కరోనా వైరస్ తీవ్ర రూపం దాల్చడంతో పలు మార్లు దీన్ని పొడిగిస్తూ వచ్చింది. అయితే విదేశాల్లో చిక్కుకున్న తమ ప్రజలను తిరిగి తీసుకొచ్చేందుకు ఆదివారం దేశంలోని 25 శాతం గగన తలాన్ని తెరుస్తున్నట్టు ప్రకటించింది. కాగా కరోనా వైరస్ కారణంగా విదేశాల్లో ఉపాధి కోల్పోయి తిరిగి వస్తున్న తమ పౌరులను ఆదుకునేందుకు సాధ్యమైన అన్ని చర్యలూ తీసుకుంటామని పాక్ ప్రధాని ఇమ్రాన్ పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-22T21:28:42+05:30 IST