పాకిస్తాన్లో బాంబు పేలుడు... ముగ్గురు మృతి, 15 మందికి గాయాలు!
ABN , First Publish Date - 2020-10-21T17:00:05+05:30 IST
పాకిస్తాన్లోని కరాచీ నగరంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటలో మరో 15 మంది తీవ్రంగా...

కరాచీ: పాకిస్తాన్లోని కరాచీ నగరంలో చోటుచేసుకున్న బాంబు పేలుడుతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నగరంలోని గుల్షన్ ఏ ఇక్బాల్ ప్రాంతంలోని కరాచీ విశ్వవిద్యాలయ మస్కాన్ గేటు వద్ద ఉన్న పురాతన భవనంలో చోటు చేసుకుంది.
ఈధీ ఫౌండేషన్ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో గాయడపడినవారిని నగరంలోని పటేల్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటివరూ ఈ పేలుడుకు కారణాలేమిటన్నది తెలియరాలేదు. అయితే సిలిండర్ పేలడంలో ఈ విధ్వంసం జరిగివుండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ బాంబు పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల కిటికీల అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలాగే అక్కడ నిలిపివుంచిన కార్ల అద్దాలు ముక్కలయ్యాయి.