పాకిస్తాన్‌లో కోవిడ్-19 ఉగ్రరూపం

ABN , First Publish Date - 2020-04-08T01:30:07+05:30 IST

: దాయాది దేశం పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ..

పాకిస్తాన్‌లో కోవిడ్-19 ఉగ్రరూపం

ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి రోజు రోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ కరోనా బారిన పడిన వారి సంఖ్య 4004కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ‘డాన్’ వెల్లడించింది. కాగా 2004 కేసులతో అత్యధిక కరోనా కేసులు నమోదైన ప్రావిన్స్‌గా పంజాబ్ నిలిచింది. పాకిస్తాన్‌లో ప్రస్తుతమున్న మొత్తం కరోనా బాధితుల్లో ఇక్కడే సగం మంది వరకు ఉండడం గమనార్హం. సింధ్‌లో 986 మంది, బలూచిస్తాన్, ఖైబర్ పక్తుంఖ్వాల్లో వరుసగా 202, 500 చొప్పన కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా ఇప్పటి వరకు పాకిస్తాన్‌లో కోవిడ్-19 నుంచి 429 మంది కోలుకున్నట్టు డాన్ పేర్కొంది. 

Updated Date - 2020-04-08T01:30:07+05:30 IST