ఫ్రాన్సుపై పాక్ అసెంబ్లీ వింత తీర్మానం

ABN , First Publish Date - 2020-10-28T14:02:27+05:30 IST

ఇస్లాం గురించి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఓ వింత తీర్మానం చేసి....

ఫ్రాన్సుపై పాక్ అసెంబ్లీ వింత తీర్మానం

ఫ్రాన్సులో లేని రాయబారిని వెనక్కి పిలిపించాలని... 

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): ఇస్లాం గురించి ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఓ వింత తీర్మానం చేసి వార్తల్లోకెక్కింది. ఇస్లాంపై వ్యాఖ్యలు చేసినందుకు గాను ఫ్రాన్సు దేశంలోని పారిస్ నుంచి పాక్ రాయబారిని తిరిగి స్వదేశానికి పిలవాలని పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ  ఏకగ్రీవంగా ఒక తీర్మానం ఆమోదించింది. అయితే అసలు పాకిస్థాన్ దేశానికి ఫ్రాన్సు దేశంలో రాయబారి లేరు. 


పారిస్ లో పాకిస్థాన్ చివరి రాయబారి మెయిన్ ఉల్ హక్ మూడు నెలల క్రితం చైనాకు బదిలీ కావడంతో అతను ఫ్రాన్సు వదిలి వెళ్లారు.అప్పటి నుంచి ఫ్రాన్సు దేశానికి హక్ స్థానంలో మరో రాయబారిని పాక్ పంపించలేదు. ఇందులో కొసమెరుపు ఏమంటే ఫ్రాన్సులో రాయబారిని వెనక్కి పిలిపించాలని పాక్ జాతీయ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మహమూద్ ఖురేషీకి పారిస్ లో పాక్ దేశ రాయబారి లేరనే విషయం తెలుసు. రాయబారి లేరని తెలిసినా లేని రాయబారిని పాక్ తిరిగి రావాలని కోరుతూ సాక్షాత్తూ పాక్ జాతీయ అసెంబ్లీ తీర్మానించడం విశేషం.కాగా ఇస్లామాబాద్‌లోని ఫ్రెంచ్ రాయబారిని పాకిస్తాన్ సోమవారం పిలిచి... మహమ్మద్ ప్రవక్త యొక్క కార్టూన్‌ల ప్రచురణను సమర్థించడం ద్వారా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఇస్లాంపై దాడి చేశారని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు.

Updated Date - 2020-10-28T14:02:27+05:30 IST