నౌషెరా సెక్టార్‌లో మళ్లీ తెగబడిన పాక్

ABN , First Publish Date - 2020-06-23T01:41:30+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌పై మరోసారి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. కాల్పుల విరమణ..

నౌషెరా సెక్టార్‌లో మళ్లీ తెగబడిన పాక్

రాజౌరి: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషెరా సెక్టార్‌పై మరోసారి పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తున్న పాక్ బలగాలు సోమవారం సాయంత్రం 6.15 గంటలకు తేలికపాటి ఆయుధాలు, మోర్టార్లతో దాడులు జరిపాయి. భారత బలగాలు ఈ కాల్పులను సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. ఉదయం కూడా పాకిస్థాన్ ఇదో ప్రాంతంలో కాల్పులకు తెగబడటంతో భారత ఆర్మీ జవాను దీపక్ కర్కి ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-23T01:41:30+05:30 IST