నిషేధిత జాబితాకు ఎక్కని పాక్‌ ఉగ్ర నేతలు: ఐరాస

ABN , First Publish Date - 2020-07-27T07:23:35+05:30 IST

పాకిస్థానీల సారథ్యంలోని పలు ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ నిషేధిత జాబితాకు ఎక్కలేదని

నిషేధిత జాబితాకు ఎక్కని పాక్‌ ఉగ్ర నేతలు: ఐరాస

ఐక్యరాజ్యసమితి, జూలై 26 : పాకిస్థానీల సారథ్యంలోని పలు ఉగ్రవాద సంస్థలు ఇప్పటికీ నిషేధిత జాబితాకు ఎక్కలేదని ఐక్యరాజ్యసమితి నివేదించింది. భారత ఉపఖండంలో అల్‌కాయిదా, ఇరాక్‌లో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) తో పాటు తెహ్రీక్‌-ఏ-తాలిబన్‌ పాకిస్థాన్‌ తదితర ఉగ్ర సంస్థలకు పాకిస్థానీలే సారథ్యం వహిస్తున్నారు. ఐఎ్‌స-కె సారథి అస్లామ్‌ ఫరూకీ, అంతకు ముందు ఆ సంస్థను నడిపించిన జియా వుల్‌ హక్‌ పాకిస్థాన్‌ దేశస్థులే. వీరి పేర్లను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బ్లాక్‌లి్‌స్టలో ఇప్పటికీ చేర్చలేదు. భారత ఉపఖండంలో అల్‌కాయిదా బాధ్యతలు చూస్తున్న ఒసామా మహమూద్‌ పేరు కూడా నిషేధిత జాబితాలో లేదని ఐరాస నివేదించింది. 

Updated Date - 2020-07-27T07:23:35+05:30 IST