పాక్ విమాన ప్రమాదం మానవతప్పిదమే!.. విచారణలో వెల్లడి

ABN , First Publish Date - 2020-06-24T04:36:01+05:30 IST

ఇటీవల పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం అదుపు తప్పి నివాస స్థలాలపై కూలిపోయింది.

పాక్ విమాన ప్రమాదం మానవతప్పిదమే!.. విచారణలో వెల్లడి

ఇస్లామాబాద్: ఇటీవల పాకిస్తాన్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం అదుపు తప్పి నివాస స్థలాలపై కూలిపోయింది. మే 22న జరిగిన ఈ ప్రమాదంలో విమానంలోని 99మందిలో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మోడల్ కాలనీ సమీపంలో ఈ విమానం కూలిపోయింది. ఇక్కడ నివశించే ఓ బాలిక కూడా ప్రమాదంలో మరణించింది. దీనిపై జరిపిన ప్రాథమిక విచారణలో మానవ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని తేలినట్లు సమాచారం. విమాన పైలట్, ట్రాఫిక్ కంట్రోలర్ నిర్లక్ష్యం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది. ప్రమాదానికి గురైన ఎయిర్‌బస్ ఏ 320 విమానంలో ఎటువంటి సాంకేతిక లోపమూ  లేదని మీడియా కథనాలు చెప్తున్నాయి.

Read more