సరిహద్దు దాటేందుకు యత్నం.. పాక్ చొరబాటుదారుడు అరెస్ట్..
ABN , First Publish Date - 2020-07-18T22:49:07+05:30 IST
సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్తానీ చొరబాటుదారుడిని ..

జమ్మూ: సరిహద్దు దాటి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ పాకిస్తానీ చొరబాటుదారుడిని భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్టు ఓ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్టు ఆయన తెలిపారు. గత నాలుగు రోజుల్లో ఇది రెండో అరెస్ట్ అని ఆయన గుర్తుచేశారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని నాయకల్ గ్రామానికి చెందిన అబ్దుల్ రెహ్మాన్ (28) అనే చొరబాటుదారుడిని ఈ నెల 15న భారత భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎల్‌వోసీ గుండా పూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తూ అతడు పట్టుబడ్డాడు.