పాక్‌కు చైనా లోదుస్తులతో చేసిన మాస్కులు!

ABN , First Publish Date - 2020-04-07T08:16:39+05:30 IST

పాకిస్థాన్‌కు చైనా కుచ్చుటోపీ పెట్టింది. కరోనా పరీక్షల కిట్లు, నాణ్యమైన ఎన్‌-95 మాస్కులు పంపిస్తామని చెప్పిన బీజింగ్‌.. లోదుస్తులతో చేసిన మాస్కులను...

పాక్‌కు చైనా లోదుస్తులతో చేసిన మాస్కులు!

ఇస్లామాబాద్‌, ఏప్రిల్‌ 6: పాకిస్థాన్‌కు చైనా కుచ్చుటోపీ పెట్టింది. కరోనా పరీక్షల కిట్లు, నాణ్యమైన ఎన్‌-95 మాస్కులు పంపిస్తామని చెప్పి.. లోదుస్తులతో చేసిన మాస్కులను పంపించింది. దీనిపై స్థానిక మీడియా చైనాపై దుమ్మెత్తిపోసింది. ఒక చైనీయ సంస్థ అందించిన పరీక్ష కిట్లు, రక్షణ పరికరాలు ఘోరంగా ఉండటంతో నేపాల్‌ భారీ ఒప్పందాన్ని రద్దు చేసింది. చైనా పంపించిన లక్షలాది కిట్లను స్పెయిన్‌ గతవారం తిప్పి పంపించింది. మరో ఘటనలో చైనాలో కరోనా విజృంభిస్తున్న తొలిదశలో ఇటలీ పంపించిన వ్యక్తిగత రక్షణ పరికరాలను(పీపీఈ) తాజాగా ఇటలీకే విక్రయించేసింది.

Read more