మందుపాతర పేల్చివేత...ఆర్మీ మేజరుతోపాటు ఆరుగురు పాక్ సైనికుల మృతి
ABN , First Publish Date - 2020-05-09T15:56:08+05:30 IST
పాక్ సరిహద్దుల్లో జరిగిన పాకిస్థాన్ -ఇరాన్ దేశాల సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదులు పేల్చిన మందుపాతర ఘటనలో పాక్ ఆర్మీ మేజరుతో పాటు ఆరుగురు సైనికులు మరణించారు.
ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాక్ సరిహద్దుల్లో జరిగిన పాకిస్థాన్ -ఇరాన్ దేశాల సరిహద్దుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉగ్రవాదులు పేల్చిన మందుపాతర ఘటనలో పాక్ ఆర్మీ మేజరుతో పాటు ఆరుగురు సైనికులు మరణించారు. బలోచ్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న బలోచ్ లిబరేషన్ ఆర్మీ మందుపాతర పెట్టి రిమోట్ తో దాన్ని పేల్చివేసింది. దీంతో మిలటరీ వాహనం తునాతునకలై ఏడుగురు మరణించారు. పాక్ మిలటరీ మేజర్ నదీం అబ్బాస్ మృతుల్లో ఉన్నారు. తామే ఈ మందుపాతరను పేల్చి పాక్ సైనికులను మట్టుబెట్టామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.