2.5 కోట్లు పలికిన మహాత్మాగాంధీ కళ్లజోడు!

ABN , First Publish Date - 2020-08-23T00:57:49+05:30 IST

మహాత్మాగాంధీకి చెందిన ఓ కళ్లజోడు వేలంలో రూ.2.5కోట్లు పలికింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ ఈ కళ్లజోడును వేలం వేసింది.

2.5 కోట్లు పలికిన మహాత్మాగాంధీ కళ్లజోడు!

హన్‌హామ్: మహాత్మాగాంధీకి చెందిన ఓ కళ్లజోడు వేలంలో రూ.2.5కోట్లు పలికింది. ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ ఈ కళ్లజోడును వేలం వేసింది. ఈ సంస్థ లెటర్ బాక్సుకు వేలాడుతూ ఈ కళ్లజోడు కనిపించిందట. వేలంలో కనీసం 15వేల యూరోలు(రూ.15లక్షలు) పలుకుతుందని నిర్వాహకులు భావించారట. అయితే అనూహ్యంగా ఇది 2.6లక్షల యూరోలు(సుమారు రూ.2.5కోట్లు) పలికింది. గతంలో సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి వీటిని సేకరించాడు. వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్స్‌కు పంపించాడు.

Updated Date - 2020-08-23T00:57:49+05:30 IST