ఏరోస్పేస్ శాస్త్రవేత్త నరసింహ కన్నుమూత

ABN , First Publish Date - 2020-12-15T12:11:34+05:30 IST

ప్రముఖ ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రొద్దం నరసింహ సోమవారం రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో...

ఏరోస్పేస్ శాస్త్రవేత్త నరసింహ కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ  ఏరోస్పేస్ శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ అవార్డు గ్రహీత రొద్దం నరసింహ సోమవారం రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రిలో కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం కావడంతో నరసింహను ఈ నెల 8వతేదీన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) లో పనిచేసిన శాస్త్రవేత్త సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారని న్యూరాలజిస్ట్ డాక్టర్ సునీల్ వి ఫుర్టాడో తెలిపారు. మెదడులో రక్తస్రావం జరగడం వల్ల మరణించారని డాక్టర్లు చెప్పారు. 2018లో నరసింహకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. 87 ఏళ్ల నరసింహకు భార్య, కుమార్తె ఉన్నారు. 1993లో జన్మించిన ప్రొఫెసర్ నరసింహ ఏరోస్పేస్ రంగంలో తనదైన ముద్ర వేశారు. 1962 నుంచి 1999వరకు ఐఐఎస్సీలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ బోధించారు. 


1984 నుంచి 1993 వరకు నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు.2000 నుంచి 2014 వరకు బెంగళూరులోని జవహర్‌లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్ (జెఎన్‌సిఎఎస్ఆర్) లో ఇంజినీరింగ్ మెకానిక్స్ యూనిట్ చైర్‌పర్సన్‌గా పనిచేశారు.ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 2013 లో భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌ను ప్రదానం చేసింది.నరసింహ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లీగ్‌లో ఉన్నారని ఆయన కుటుంబ మిత్రులు తెలిపారు.డాక్టర్ కలాం, ప్రొఫెసర్ నరసింహ కలిసి‘‘ఫ్లూయిడ్ మెకానిక్స్ స్పేస్ టెక్నాలజీ అభివృద్ధి’’ అనే పుస్తకాన్ని రచించారు.ప్రముఖ శాస్త్రవేత్త,భారత్ రత్న అవార్డు గ్రహీత డాక్టర్ సిఎన్ఆర్ రావుకు నరసింహ మంచి స్నేహితుడు.

Updated Date - 2020-12-15T12:11:34+05:30 IST