త్రిపురలో 100 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2020-07-20T23:48:47+05:30 IST

త్రిపురలో ఇవాళ కొత్తగా 223 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం..

త్రిపురలో 100 మంది బీఎస్ఎఫ్ సిబ్బందికి కరోనా

అగర్తాలా: త్రిపురలో ఇవాళ కొత్తగా 223 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం వైరస్ బాధితుల సంఖ్య 2,892కు పెరిగినట్టు ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ వెల్లడించారు.  కొత్తగా ఇన్ఫెక్షన్‌కి గురైన వారిలో 101 మంది బీఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారని సీఎం తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,114 మంది కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... 1,759 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మహమ్మారి కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మందిని ఇతర రాష్ట్రాలకు పంపించారు. కాగా కరోనా బారిన పడిన జవాన్లకు సల్బాగన్‌లోని రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్టు బీఎస్ఎఫ్ తెలిపింది. త్రిపురలో 856 కిలోమీటర్ల పొడవైన భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ పహారా కాస్తోంది.

Updated Date - 2020-07-20T23:48:47+05:30 IST