స్పెయిన్‌లో ఊరట.. రష్యాలో ఉధృతి

ABN , First Publish Date - 2020-05-17T07:37:49+05:30 IST

కరోనా విజృంభణతో అల్లాడిన స్పెయిన్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

స్పెయిన్‌లో ఊరట.. రష్యాలో ఉధృతి

  • చైనాలో 21 కొత్త కేసులు
  • అమెరికాలో ఇళ్ల వద్దే శాంపిల్స్‌ సేకరణ

మాస్కో, మాడ్రిడ్‌, మే 16: కరోనా విజృంభణతో అల్లాడిన స్పెయిన్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చింది. కొత్తగా ఆ దేశంలో 104 మంది మృతి చెందారు. ఇటీవలి కాలంలో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. మరోవైపు రష్యాలో 9 వేల పైగానే కేసులు నమోదయ్యాయి. మరణాల శాతం క్రమంగా పెరుగుతోంది. బ్రెజిల్‌లో కేసుల సంఖ్య అమాంతం తగ్గింది. కొత్తగా 2,068 మాత్రమే నమోదయ్యాయి. 145 మంది ప్రాణాలు కోల్పోయారు. 


కరోనా పరీక్షలను విస్తృతం చేసే ఆలోచనలో ఉన్న అమెరికాలో.. ఇళ్ల వద్దకే వచ్చి నమూనాలు సేకరించే ‘డీఐవై నాసల్‌ శాంపిల్‌ కిట్‌’కు ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అమోదం తెలిపింది. దేశంలో క్రితం రోజుతో పోలిస్తే శనివారం 600 వరకు మరణాలు తగ్గాయి.  చైనాలో శనివారం 21 కొత్త కేసులు నమోదయ్యాయి.   బంగ్లాదేశ్‌లోని కాక్స్‌ బజార్‌ శిబిరాల్లో తలదాచుకుంటున్న రొహింగ్యాల్లో ముగ్గురు కరోనా బారిన పడ్డారు.

Updated Date - 2020-05-17T07:37:49+05:30 IST