175 మంది మలేసియా పౌరులు తిరుగుముఖం

ABN , First Publish Date - 2020-03-30T22:53:32+05:30 IST

మలేసియాకు చెందిన 175 మందికి పైగా పౌరులు ఎట్టకేలకు తమ దేశానికి పయనమవుతున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను ...

175 మంది మలేసియా పౌరులు తిరుగుముఖం

అమృత్‌సర్: మలేసియాకు చెందిన 175 మందికి పైగా పౌరులు ఎట్టకేలకు తమ దేశానికి పయనమవుతున్నారు. అంతర్జాతీయ విమాన సర్వీసులను సస్పెండ్ చేయడంతో వీరంతా ఇక్కడే చిక్కుకుపోయారు. భారత ప్రభుత్వ సమన్వయంతో వీరిని తీసుకువెళ్లేందుకు మలేసియా ప్రభుత్వం ప్రత్యేక మిలిండో ఎయిర్‌లైన్స్ విమానాన్ని అమృత్‌సర్‌కు పంపుతోంది. షెడ్యూల్ ప్రకారం సోమవారం సాయంత్రం ఈ ప్రత్యేక విమానం మలేసియా బయలుదేరుతోంది.


'శ్రీ హర్మీందర్ సాహిబ్‌ను సందర్శించేందుకు మేము మలేసియా నుంచి వచ్చాం. ప్రస్తుత పరిస్థితి నుంచి మమ్మల్ని ఆదుకునేందుకు మలేసియా, భారత్ ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చాయి. మేమంతా మలేసియాకు తిరిగి వెళ్లిపోతున్నాం. సహకరించిన ఇరుదేశాల ప్రభుత్వాలకు, ఖల్సా ఎయిడ్, పంజాబ్ పోలీసులకు మా కృతజ్ఞతలు' అని ప్రయాణికుల్లో ఒకరైన జితేంద్ర సింగ్ తెలిపారు. మాకు బస కల్పించిన హోటల్ ఓనర్లతో సహా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని మరో ప్రయాణికురాలు జితేంద్ర కౌర్ తెలిపారు. దేశవ్యాప్త లాక్‌డౌన్‌లో భాగంగా ఏప్రిల్ 14 వరకూ అన్నిఅంతర్జాతీయ విమాన రాకపోకలను భారత ప్రభుత్వం నిలిపివేసింది.

Updated Date - 2020-03-30T22:53:32+05:30 IST