బీహార్‌ను ముంచెత్తుతున్న‌ వ‌ర్షాలు, వరదలు

ABN , First Publish Date - 2020-07-28T16:44:51+05:30 IST

బీహార్‌లోని 15 జిల్లాల్లోగ‌ల‌ 24 చెరువులు, ఉప‌న‌దులు భారీ వ‌ర్షాల కారణంగా ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున‌న్నాయి. చాలాచోట్ల చెరువు క‌ట్ట‌లు తెగిపోయి...

బీహార్‌ను ముంచెత్తుతున్న‌ వ‌ర్షాలు, వరదలు

ప‌ట్నా: బీహార్‌లోని 15 జిల్లాల్లోగ‌ల‌ 24 చెరువులు, ఉప‌న‌దులు భారీ వ‌ర్షాల కారణంగా ఉప్పొంగి ప్ర‌వ‌హిస్తున‌న్నాయి. చాలాచోట్ల చెరువు క‌ట్ట‌లు తెగిపోయి, లోత‌ట్టు ప్రాంతాల్లోకి నీరు ప్ర‌వ‌హిస్తోంది. ఇటువంటి ప‌రిస్థితులు కొన‌సాగుతున్న నేప‌ధ్యంలో పట్నా వాతావరణ కేంద్రం ఆగస్టు ఒక‌టి వరకు భారీ వర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని హెచ్చరించింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాలలో భారీ వ‌ర్షాల ముప్పు ఉండవ‌చ్చ‌ని తెలిపింది. తాజాగా 11 జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు వరదనీరు చేరుకుంద‌ని, ఇది మరో మిలియన్ జనాభాను ప్రభావితం చేస్తుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. బీహార్‌లోని 38 జిల్లాల్లోని 11 జిల్లాల్లో మొత్తం 2.4 మిలియన్ల ప్రజలు వరద ప్ర‌భావానికి గురయ్యారని, ముఖ్యంగా దర్భాంగా ఎక్కువగా ప్రభావితమైందని ఆ విభాగం తన బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలోని 15 జిల్లాల్లోని 24 ఏడు నదులు ఇప్పటికే ప్రమాద స్థాయిని మించి ప్ర‌వ‌హిస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాట్లాడుతూ వరద పరిస్థితిని అదుపులో ఉంచడానికి క‌ర‌కట్టలను ఎప్ప‌టిక‌ప్పుడు పర్యవేక్షిస్తుండాల‌ని, ఈ విష‌యంలో జలవనరులశాఖ ఇంజనీర్లను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన‌ 17 బృందాలు, ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు చెందిన‌ ఎనిమిది బృందాలు రాష్ట్రవ్యాప్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. 

Updated Date - 2020-07-28T16:44:51+05:30 IST