మాది గాంధీ హిందుత్వం: కేపీసీసీ చీఫ్ డీకే

ABN , First Publish Date - 2020-12-02T01:24:07+05:30 IST

మాది గాంధీ హిందుత్వం: కేపీసీసీ చీఫ్ డీకే

మాది గాంధీ హిందుత్వం: కేపీసీసీ చీఫ్ డీకే

బెంగళూరు: హిందుత్వం ఏ ఒక్కరి ఆస్తో కాదని, మతం పేరు చెప్పి ఓట్లు అడుక్కోవాల్సిన అవసరం ఏంటని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ అన్నారు. తాము హిందువులమేనని, తమది మహాత్ముడు అనుసరించిన హిందుత్వమని ఆయన అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి కాంగ్రెస్ కూడా హందుత్వ సిద్ధాంతాన్ని వాడుకుంటుందా అన్న ప్రశ్నకు డీకే పై విధంగా సమాధానం ఇచ్చారు.


‘‘మాది మహాత్మగాంధీ అనుసరించిన హిందుత్వం. మాది వివేకానందుడు ప్రవచించిన హిందుత్వం. హిందుత్వం ఏ ఒక్కరి ఆస్తి కాదు. ఇండియా సంస్కృతి, సంప్రదాయాల సంపద దేశ ప్రజలందరి సొంతం. రాజ్యాంగం తెలిపిన ప్రకారం దేశంలోని ప్రజలందరి విశ్వాసాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. రాజ్యాంగాన్ని రక్షించడమే మా ప్రధాన నిబద్ధత, మా ఎజెండా’’ అని డీకే శివకుమార్ అన్నారు.

Updated Date - 2020-12-02T01:24:07+05:30 IST