నల్ల జాతీయులకు ఇండియన్, సౌత్ ఆసియన్లు మద్దతివ్వాలి : ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్

ABN , First Publish Date - 2020-06-06T22:49:05+05:30 IST

అమెరికాలో ఇటీవల జరిగిన ఆఫ్రికన్-అమెరికన్ల హత్యలపై మౌనంగా ఉంటున్న

నల్ల జాతీయులకు ఇండియన్, సౌత్ ఆసియన్లు మద్దతివ్వాలి : ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్

వాషింగ్టన్ : అమెరికాలో ఇటీవల జరిగిన ఆఫ్రికన్-అమెరికన్ల హత్యలపై మౌనంగా ఉంటున్న ఇండియన్, సౌత్ ఆసియన్ సంతతి ప్రజలపై ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికాలో నల్లజాతీయులపై వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉంటే ఇండియన్, సౌత్ ఆసియన్ సంతతి ప్రజలు చాలా కాలం నుంచి మౌనంగా ఉంటున్నారని దుయ్యబట్టింది. 


మే 25న మిన్నెపోలీస్‌లో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని శ్వేత జాతీయుడైన ఓ పోలీసు అధికారి హత్య చేయడం, మార్చి 13న లూయిస్‌విల్లే మెట్రో పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఆఫ్రికన్ - అమెరికన్ మహిళ బ్రెయెన్నా టేలర్‌ను హత్య చేయడం గురించి ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ ప్రస్తావించింది. 


‘‘మనం స్పష్టంగా ఉందాం : మన కమ్యూనిటీ నిరపరాధి కాదు’’ అని ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ పేర్కొంది.


చాలా కాలం నుంచి ఇండియన్ అమెరికన్లు, సౌత్ ఆసియన్-అమెరికన్లు మౌనంగా ఉంటున్నారని, మరింత దారుణంగా అనైతిక వ్యవహారాల్లో భాగస్వాములవుతున్నారని పేర్కొంది. 


మనలో చాలా మంది అమెరికాలో ఉండటానికి కారణం నల్ల జాతీయులు, పౌర హక్కుల ఉద్యమకారులు చేసిన త్యాగాలేనని పేర్కొంది. జాతి, జాతి వివక్ష గురించి మన స్నేహితులు, కుటుంబాలతో ఇప్పటికీ తీవ్రంగా చర్చించడం లేదని, ఇది మారాలని పేర్కొంది. 


నల్ల జాతీయుల జీవితాలు విలువైనవని, నల్ల జాతీయుల పోరాటానికి మనమంతా మద్దతివ్వాలని పేర్కొంది. 


ఇండియన్ అమెరికన్ ఇంపాక్ట్ ఫండ్ అమెరికాలో ఇండియన్ - అమెరికన్లు రాజకీయాల్లో చేరి, అధికారిక పదవులు పొందేవిధంగా ప్రోత్సహిస్తుంది. 


Updated Date - 2020-06-06T22:49:05+05:30 IST