ప్లస్‌ వన్‌ అడ్మిషన్లకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ

ABN , First Publish Date - 2020-06-16T15:23:40+05:30 IST

ప్లస్‌ వన్‌ అడ్మిషన్లకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ

ప్లస్‌ వన్‌ అడ్మిషన్లకు అనుమతి లేదని ఉత్తర్వులు జారీ

చెన్నై: ప్రస్తుత పరిస్థితుల్లో ప్లస్‌ వన్‌ సహా అన్నిరకాల తరగతుల అడ్మిషన్లు నిర్వహించకూడదని పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. కొన్ని ప్రైవేటు పాఠశాలలు మాత్రం ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేపట్టాయి. రాష్ట్రప్రభుత్వం టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షలు రద్దుచేసి అందరినీ పాస్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. పలు ప్రైవేటు పాఠశాలలు ప్లస్‌ వన్‌ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్రైమాసిక, అర్ధ వార్షిక పరీక్ష ఆధారంగా గ్రూపులను ఎంపిక చేయాలని విద్యార్థులకు పాఠశాలలు సిఫార్సు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టే ప్రైవేటు పాఠశాలలపై చర్యలు చేపడతామని పాఠశాల విద్యాశాఖ హెచ్చరించింది.

Updated Date - 2020-06-16T15:23:40+05:30 IST