గెహ్లోత్ బల నిరూపణ చేసుకోవాలని మా డిమాండ్ కాదు : ప్రతిపక్ష నేత కటారియా

ABN , First Publish Date - 2020-07-19T18:20:32+05:30 IST

ముఖ్యమంత్రి గెహ్లోత్ బల నిరూపణ చేసుకోవాలని తామెన్నడూ డిమాండ్ చేయలేదని, ఇప్పటికీ

గెహ్లోత్ బల నిరూపణ చేసుకోవాలని మా డిమాండ్ కాదు : ప్రతిపక్ష నేత కటారియా

జైపూర్ : ముఖ్యమంత్రి గెహ్లోత్ బల నిరూపణ చేసుకోవాలని తామెన్నడూ డిమాండ్ చేయలేదని, ఇప్పటికీ తమ డిమాండ్ అది కాదని ప్రతిపక్ష నేత జీసీ కటారియా స్పష్టం చేశారు. ఏం జరుగుతుందో మేము గమనిస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై పార్టీలో చర్చించి, దానికి తగ్గట్టుగానే వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు.


ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారంతో తమకెలాంటి సంబంధమూ లేదని, అనవసరంగా ఈ బురదలోకి బీజేపీని లాగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలకు ఫోన్లను ట్యాప్ చేసే అధికారం ఉందని, అయితే ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టిని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.


ప్రైవేట్‌కు చేయడానికి ఏమాత్రం అధికారం లేదని స్పష్టం చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్‌ను సీఎం ఓఎస్డీ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని, అలా చేస్తే మాత్రం చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని కటారియా స్పష్టం చేశారు. 

Updated Date - 2020-07-19T18:20:32+05:30 IST