ఢిల్లీ ఎయిమ్స్‌లో ఓపీడీ సేవలకు గ్రీన్ సిగ్నల్

ABN , First Publish Date - 2020-06-23T22:26:13+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముక వైద్యశాల ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఓపీడీ) సేవలు మళ్లీ ప్రారంభించబోతున్నారు. కోవిడ్-19 వ్యాప్తితో దాదాపు 3 నెలల పాటు ఓపీడీ సేవలు నిలిపివేశారు

ఢిల్లీ ఎయిమ్స్‌లో ఓపీడీ సేవలకు గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (ఓపీడీ) సేవలు మళ్లీ ప్రారంభించబోతున్నారు. కోవిడ్-19 వ్యాప్తితో దాదాపు 3 నెలల పాటు ఓపీడీ సేవలు నిలిపివేశారు. ఇంత సుదీర్ఘ కాలం తర్వాత జూన్ 25 నుంచి ఓపీడీ సేవలు యధాతధంగా నడవనున్నట్లు ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు.


‘‘ఓపీడీ సర్వీసులు మళ్లీ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా ఎయిమ్స్‌ మొత్తంగా ఓపీడీ సేవలు రద్దు చేశాం. దాదాపు 3 నెలల తర్వాత ఇవి మళ్లీ ప్రారంభం కానున్నాయి. అయితే టెలికన్సల్టేషన్ చేసిన తర్వాతనే ఓపీడీ సేవలు అందిస్తాం’’ అని ఎయిమ్స్‌కు చెందిన ఓ డాక్టర్ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-23T22:26:13+05:30 IST