సుప్రీంకోర్టులో ‘కరోనా’ జాగ్రత్తలు... న్యాయవాదులకు మాత్రమే ప్రవేశం...

ABN , First Publish Date - 2020-03-14T00:57:11+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19)పై సుప్రీంకోర్టు కూడా దృష్టి సారించింది. కేవలం అత్యవసర కేసులపై మాత్రమే విచారణ జరపాలని, న్యాయవాదులు మినహా ఇతరులను కోర్టు గదుల్లోకి అనుమతించరాదని నిర్ణయించింది.

సుప్రీంకోర్టులో ‘కరోనా’ జాగ్రత్తలు... న్యాయవాదులకు మాత్రమే ప్రవేశం...

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ (కోవిడ్-19)పై సుప్రీంకోర్టు కూడా దృష్టి సారించింది. కేవలం అత్యవసర కేసులపై మాత్రమే విచారణ జరపాలని, న్యాయవాదులు మినహా ఇతరులను కోర్టు గదుల్లోకి అనుమతించరాదని నిర్ణయించింది. 


కేంద్ర ప్రభుత్వం ఈ నెల 5న జారీ చేసిన సలహాను సుప్రీంకోర్టు పరిశీలించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎస్ఏ బాబ్డే అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుని, ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.


‘‘భారత ప్రభుత్వం జారీ చేసిన సలహాను పరిశీలించిన మీదట, వైద్య వృత్తి నిపుణులతో సహా ప్రజారోగ్య నిపుణుల అభిప్రాయం దృష్ట్యా,  అందరు సందర్శకులు, కక్షిదారులు, న్యాయవాదులు, న్యాయస్థానం సిబ్బంది, భద్రత, మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్ స్టాఫ్, స్టూడెంట్ ఇంటర్న్‌స్, మీడియా ప్రొఫెషనల్స్ భద్రత, సంక్షేమాన్ని కూడా పరిశీలించిన మీదట, కోర్టు కార్యకలాపాలను తగినన్ని ధర్మాసనాలతో అత్యవసర కేసులకు మాత్రమే పరిమితం చేయాలని కాంపిటెంట్ అథారిటీ ఆదేశించారు’’ అని సుప్రంకోర్టు నోటిఫికేషన్ పేర్కొంది.


 

Updated Date - 2020-03-14T00:57:11+05:30 IST