బార్బర్ షాపుల్లో హెయిర్ కటింగ్‌కు ఓకే.. షేవింగ్‌కు నాట్ ఓకే..!

ABN , First Publish Date - 2020-05-18T23:20:48+05:30 IST

కేంద్ర ప్రభుత్వం మే 31 వరకూ లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో...

బార్బర్ షాపుల్లో హెయిర్ కటింగ్‌కు ఓకే.. షేవింగ్‌కు నాట్ ఓకే..!

తిరువనంతపురం: కేంద్ర ప్రభుత్వం మే 31 వరకూ లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలను ప్రకటించిన నేపథ్యంలో కేరళ ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను విడుదల చేసింది. బుధవారం నుంచి లిక్కర్ దుకాణాలు తెరిచేందుకు అనుమతినిచ్చింది.


బార్బర్ షాపులు తెరిచేందుకు కేరళ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే.. బార్బర్ షాపుల్లో హెయిర్ కటింగ్ మాత్రమే చేయాలని, షేవింగ్ చేయకూడదని ప్రభుత్వం నిబంధన పెట్టింది. ఫేసియల్స్ కూడా చేయకూడదని మార్గదర్శకాల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. బ్యూటీపార్లర్లు తెరిచేందుకు అనుమతి లేదని పేర్కొంది. బార్బర్ షాపులకు సంబంధించి మరో కీలక హెచ్చరిక కూడా చేసింది. బార్బర్ షాపుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏసీలను వాడకూడదని తెలిపింది. ఎస్‌ఎస్ఎల్‌సీ, ప్లస్ వన్, ప్లస్ టూ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Updated Date - 2020-05-18T23:20:48+05:30 IST