కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన చత్తీస్‌గఢ్

ABN , First Publish Date - 2020-05-11T22:31:25+05:30 IST

కరోనా వైరస్ నుంచి చత్తీస్‌గఢ్ అద్భుతంగా కోలుకుంది. వైరస్ విజయవంతంగా కట్టడి చేసింది. కరోనా నుంచి

కరోనాను అద్భుతంగా కట్టడి చేసిన చత్తీస్‌గఢ్

రాయ్‌పూర్: కరోనా వైరస్ నుంచి చత్తీస్‌గఢ్ అద్భుతంగా కోలుకుంది. వైరస్‌ను విజయవంతంగా కట్టడి చేసింది. కరోనా నుంచి కోలుకున్న నలుగురు వ్యక్తులను వైద్యాధికారులు ఈరోజు డిశ్చార్జ్ చేశారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో కేవలం ఆరు కేసులు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. వరుసగా రెండుసార్లు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ అని తేలడంతో కబీర్‌ధామ్, సూరజ్‌పూర్ జిల్లాలకు చెందిన చెరో ఇద్దరు కరోనా బాధితులను డిశ్చార్జ్ చేసినట్టు ఎయిమ్స్ ప్రజా సంబంధాల అధికారి ఒకరు తెలిపారు. వీరు నలుగురు వలస కార్మికులేనని, ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రానికి వచ్చారని పేర్కొన్నారు. వారిని డిశ్చార్జ్ చేసినప్పటికీ 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచించినట్టు చెప్పారు. 

Updated Date - 2020-05-11T22:31:25+05:30 IST