ఆసుపత్రుల్లో ఉన్నది 2,100 మందే: కేజ్రీవాల్

ABN , First Publish Date - 2020-05-30T20:44:13+05:30 IST

దేశ రాజధానిలోని మొత్తం కోవిడ్-19 కేసుల్లో ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు కేవలం 2,100 మంది మాత్రమేనని..

ఆసుపత్రుల్లో ఉన్నది 2,100 మందే: కేజ్రీవాల్

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని మొత్తం కోవిడ్-19 కేసుల్లో ఆసుపత్రుల్లో ఉండి చికిత్స పొందుతున్న వారు కేవలం 2,100 మంది మాత్రమేనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  చెప్పారు. తక్కిన వారు ఇళ్లలోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు. శనివారంనాడిక్కడ మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్న విషయాన్ని తాము ఒప్పుకుంటున్నామని, ఇది ఆందోళన కలిగించే విషయమే అయినా, ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నాలుగు దశల్లో చర్యలు తీసుకుంటోందని వివరించారు.


కోవిడ్ పేషెంట్ల కోసం 6,600 పడకలు సిద్ధం చేశామని, జూన్ 5వ తేదీ నాటికి ఢిల్లీలో 9,500 పడకలు సిద్ధంగా ఉంటాయని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో మొత్తం 17,386 కోవిడ్ కేసుల్లో 9,142 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 7,846 మందికి పూర్తి స్వస్థత చేకూరిందని ముఖ్యమంత్రి వివరించారు. ఇంతవరకూ 398 మంది మృత్యువాత పడినట్టు చెప్పారు.

Updated Date - 2020-05-30T20:44:13+05:30 IST