శబరిమలకు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌

ABN , First Publish Date - 2020-10-12T07:44:08+05:30 IST

కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ బోర్డు తెలిపింది. ఈనెల 16 నుంచి ఆలయం తెరుస్తారని...

శబరిమలకు ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌

  • కరోనా లేదన్న ధ్రువీకరణ తప్పనిసరి

కరోనా నేపథ్యంలో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్‌ రిజిస్ర్టేషన్‌ విధానాన్ని తీసుకొచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ బోర్డు తెలిపింది. ఈనెల 16 నుంచి ఆలయం తెరుస్తారని, 12 నుంచి www.sabarimalaonline.org వెబ్‌సైట్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చని వివరించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు 1000 మందిని, శని, ఆదివారాల్లో రెండు వేల మందిని అనుమతిస్తారని తెలిపింది. ప్రతి భకుడూ కచ్చితంగా కొవిడ్‌ లేదన్న ధ్రువీకరణ పత్రాన్ని కలిగి ఉండాలని, అదీ 48 గంటల్లోపు పొంది ఉండాలని స్పష్టం చేసింది.

Updated Date - 2020-10-12T07:44:08+05:30 IST