పుల్వామాలో ఎన్‌కౌంటర్...ఉగ్రవాది హతం

ABN , First Publish Date - 2020-11-06T13:54:45+05:30 IST

జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా పాంపొరిలోని లాల్ పొరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు....

పుల్వామాలో ఎన్‌కౌంటర్...ఉగ్రవాది హతం

పుల్వామా (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా పాంపొరిలోని లాల్ పొరా గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. లాల్ పొరా గ్రామంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీరు పోలీసులు కేంద్ర భద్రతా బలగాలతో కలిసి గురువారం రాత్రి గాలింపు చేపట్టారు. గాలిస్తున్న జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు గాయపడ్డారు.ఈ ఎన్‌కౌంటర్ లో గుర్తుతెలియని ఉగ్రవాది ఒకరు మరణించారని జమ్మూకశ్మీరు పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం శుక్రవారం కూడా గాలింపు కొనసాగుతుందని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

Updated Date - 2020-11-06T13:54:45+05:30 IST