ప్రపంచ అతిపెద్ద ప్యాకేజీల్లో ఒకటి

ABN , First Publish Date - 2020-05-13T07:21:30+05:30 IST

లాక్‌డౌన్‌తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీల్లో ఒక టిగా నిలిచింది. దేశంలోని అన్ని వర్గాలనూ ఆదుకునేం దుకు రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని...

ప్రపంచ అతిపెద్ద ప్యాకేజీల్లో ఒకటి

న్యూఢిల్లీ, మే 12: లాక్‌డౌన్‌తో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రధాని మోదీ ప్రకటించిన ప్యాకేజీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక ప్యాకేజీల్లో ఒక టిగా నిలిచింది. దేశంలోని అన్ని వర్గాలనూ ఆదుకునేందుకు రూ.20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని ప్రధాని మంగళవారం ప్రకటించారు. భారత జీడీపీలో ఇది 10 శాతమని ఆయన అన్నారు. ఇప్పటికే జపాన్‌ తమ జీడీపీలో 21 శాతానికి పైగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటిం చగా, అమెరికా తమ జీడీపీలో 13ు ప్యాకేజీని ప్రక టించింది. మోదీ ప్యాకేజీలో గత మార్చిలో పేదలు, నిరుపేద మహిళలు, వృద్ధులకు ఉచిత ఆహార పదార్థా లకు ఇచ్చే రూ.1.7 లక్షల కోట్లు కూడా ఉన్నాయి.


Updated Date - 2020-05-13T07:21:30+05:30 IST