పాక్‌ కాల్పుల్లో భారత జవాన్‌ మృతి

ABN , First Publish Date - 2020-06-23T07:10:12+05:30 IST

సరిహద్దుల వెంబడి పాక్‌ కవ్వింపు చర్యలకు మరో భారత జవాన్‌ అమరుడయ్యాడు. సోమవారం తెల్లవారుజామున కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి...

పాక్‌ కాల్పుల్లో భారత జవాన్‌ మృతి

జమ్మూ, జూన్‌ 22: సరిహద్దుల వెంబడి పాక్‌ కవ్వింపు చర్యలకు మరో భారత జవాన్‌ అమరుడయ్యాడు.  సోమవారం తెల్లవారుజామున కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాక్‌ దళాలు కాల్పులకు తెగబడ్డాయి. పూంచ్‌ జిల్లా, కృష్ణ ఘాటి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ), కతువా జిల్లా, హీరానగర్‌ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద గల భారత శిబిరాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్‌ కాల్పులు జరిపిందని, తిప్పికొట్టే క్రమంలో ఓ భారత వీరుడు అమరుడయ్యాడని ఆర్మీ వర్గాలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ జరిపిన కాల్పుల్లో ఈ నెలలో ఇప్పటివరకు భారత్‌ నలుగురు జవాన్లను కోల్పోయింది.


Read more