అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2020-06-22T07:15:23+05:30 IST

కాల్పులతో అమెరికా హోరెత్తింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకరు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. మినియాపోలి్‌సలో ఆదివారం తెల్లవారుజామున రెండు గ్రూపుల మధ్య ఈ కాల్పులు...

అమెరికాలో కాల్పులు.. ఒకరి మృతి

మినియాపోలిస్‌, జూన్‌ 21: కాల్పులతో అమెరికా హోరెత్తింది. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఈ కాల్పులు చోటు చేసుకోవడం కలకలం సృష్టించింది. ఒకరు మృతి చెందగా.. 25 మంది గాయపడ్డారు. మినియాపోలి్‌సలో ఆదివారం తెల్లవారుజామున రెండు గ్రూపుల మధ్య ఈ కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా 11 మంది గాయపడ్డారు. ఇక న్యూయార్క్‌, టెక్సస్‌ రాజధాని ఆస్టిన్‌లో కాల్పులు జరగగా 14 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 


Updated Date - 2020-06-22T07:15:23+05:30 IST