ఒక్క రోజులోనే లక్ష శానిటైజర్లను ఉత్పత్తి చేసిన కేరళ

ABN , First Publish Date - 2020-03-21T18:24:03+05:30 IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా బయటపడిన మొదటి వారంలో రాష్ట్రంలో తగినన్ని

ఒక్క రోజులోనే లక్ష శానిటైజర్లను ఉత్పత్తి చేసిన కేరళ

తిరువనంతపురం : దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా బయటపడిన మొదటి వారంలో రాష్ట్రంలో తగినన్ని శానిటైజర్స్, మాస్క్‌లు అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. రానూ రానూ దేశంలో కరోనా వైరస్ జడలు విప్పడంతో పినరయ్  సర్కార్ అప్రమత్తమైంది. శానిటైజర్స్‌ను, మాస్క్‌లను ప్రజలకు అందుబాటులో ఉండటానికి స్వయంగా నడుం బిగించింది. కేరళ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఒక్కరోజునే లక్ష శానిటైజర్స్ బాటిల్స్‌ను ఉత్పత్తి చేశారు.


కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో శానిటైజర్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగిందని, దానిని దృష్టిలో ఉంచుకొని ఇంతటి భారీ సంఖ్యలో ఉత్పత్తి చేశామని పరిశ్రమల మంత్రి జయరాజన్ తెలిపారు. దాదాపు 200 మంది ఉద్యోగులు 3 షిప్టులో పనిచేసి లక్ష శానిటైజర్ బాటిల్స్‌ను ఉత్పత్తి చేశారు. ఇతర మందుల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేసి, కేవలం శానిటైజర్స్ ఉత్పత్తి పైనే దృష్టి సారించాం. ఒకానొక దశలో వీటికి అవసరమైన ముడిసరుకు కొరత ఏర్పడింది. డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ సంస్థలు ముడి సరుకు ధరలను విపరీతంగా పెంచేశాయి. ఎక్సైజ్ శాఖ ముందుకొచ్చి వాటికి అవసరమైన ముడి సరుకును అందించింది.’’ అని మంత్రి జయరాజన్ తెలిపారు. 

Updated Date - 2020-03-21T18:24:03+05:30 IST