ఫూంచ్ సెక్టారులో పాక్ ఆర్మీ కాల్పులు...ఓ పౌరుడి మృతి

ABN , First Publish Date - 2020-07-08T15:29:32+05:30 IST

జమ్మూకశ్మీర్ లోని ఫూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు పాక్ సైన్యం కాల్పులు జరిపింది...

ఫూంచ్ సెక్టారులో పాక్ ఆర్మీ కాల్పులు...ఓ పౌరుడి మృతి

ఫూంచ్ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్ లోని ఫూంచ్ జిల్లా బాలాకోట్ సెక్టార్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు పాక్ సైన్యం కాల్పులు జరిపింది. సరిహద్దుల్లో పాక్ సైనికులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఈ కాల్పుల్లో ఫూంచ్ జిల్లాకు చెందిన ఓ పౌరుడు మరణించారు. పాక్ ఆర్మీ కాల్పుల్లో మరో పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన పౌరుడిని ఆసుపత్రికి తరలించారు. పాక్ ఆర్మీ కాల్పులను భారత సైనికులు తిప్పి కొట్టారు. బుధవారం తెల్లవారుజామున 2.45 గంటలకు భారత సైనికుల ప్రతి దాడితో పాక్ ఆర్మీ కాల్పులు నిలిపివేసింది. 

Updated Date - 2020-07-08T15:29:32+05:30 IST