ఉద్ధవ్ ‘స్టీరింగ్’ వ్యాఖ్యలపై ఒక్క ఫొటోతో పుట్టినరోజు నాడే సీఎంకు ఝలక్ ఇచ్చిన పవార్

ABN , First Publish Date - 2020-07-27T18:05:51+05:30 IST

సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే 60 వ పుట్టిన రోజు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్

ఉద్ధవ్ ‘స్టీరింగ్’ వ్యాఖ్యలపై ఒక్క ఫొటోతో పుట్టినరోజు నాడే సీఎంకు ఝలక్ ఇచ్చిన పవార్

ముంబై : సోమవారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే 60 వ పుట్టిన రోజు. డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలుపుతూనే... ఓ ఫొటోతో ఝలక్ ఇచ్చారు. ఆ ఫొటోలో ముఖ్యమంత్రి ఉద్ధవ్... డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఓ కారులో కూర్చున్నారు. ఆ కారు స్టీరింగ్ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చేతిలో స్టీరింగ్ ఉన్న ఫొటో అది. ఇలా సైలెంట్‌గా ఈ ఫొటోను పోస్ట్ చేసి... ముఖ్యమంత్రికి పుట్టినరోజు నాడే అజిత్ ఝలక్ ఇచ్చారు.


‘‘ముఖ్యమంత్రి, శివసేన అధినేత, మహావికాస్ అగాఢీ నేత ఉద్ధవ్ థాకరేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆరోగ్యంగా.. దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’’ అంటూ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ట్వీట్ చేశారు.


దాంతో పాటు ఇద్దరూ కారులో ఉన్న ఫొటోను కూడా పోస్ట్ చేశారు. దీనిపై కొందరు నేతలు స్పందిస్తూ... ‘‘అన్నా.. కారు స్టీరింగ్ మీ చేతిలో ఉన్న ఫొటో పోస్ట్ చేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షల సమయాన ఇలాంటి ఫొటోను ఎందుకు పోస్ట్ చేశారు? ఇది దేనికి సంకేతం?’’ అంటూ చాలా మంది సూటిగానే అజిత్ ను ప్రశ్నించారు. 

నా చేతుల్లోనే స్టీరింగ్ : సామ్నాతో ముఖ్యమంత్రి ఉద్ధవ్

ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే శివసేన పత్రిక అయిన సామ్నాకు ఆదివారం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్య్వూలో ఆయన మాట్లాడుతూ... ‘‘మహా వికాస్ అగాఢీ ప్రభుత్వ భవిష్యత్తు ప్రతిపక్షాల చేతుల్లో లేదు. ఎందుకంటే స్టీరింగ్ నా చేతుల్లోనే ఉంది. ప్రభుత్వాన్ని నడిపేది నేనే. ఆటోరిక్షా వంటిది నా ప్రభుత్వం. వెనుక చక్రాలు కాంగ్రెస్,ఎన్సీపీ. అవి నా వెనుక ఉన్నాయి’’ అంటూ ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్‌గా అజిత్ పై ఫొటోను పోస్ట్ చేశారు. 

Updated Date - 2020-07-27T18:05:51+05:30 IST