ప్యాకేజీలో పాత ప్రకటనలు
ABN , First Publish Date - 2020-05-13T07:31:28+05:30 IST
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశ జీడీపీలో పది శాతం. ప్రధాన రంగాలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చేసిన ప్రకటనలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేసిన సూచనలు ఈ ప్యాకేజీలో...

ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ దేశ జీడీపీలో పది శాతం. ప్రధాన రంగాలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే చేసిన ప్రకటనలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేసిన సూచనలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. అవేంటంటే..
- ఈ ప్యాకేజీకి ముందు కేంద్రం, ఆర్బీఐ రూ.7.79 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించాయి.
- మ్యూచ్యువల్ ఫండ్లపై ద్రవ్య లభ్యత ఒత్తిడిని తగ్గించేందుకు మ్యూచ్యువల్ ఫండ్ల కోసం రూ.50 వేల కోట్ల ప్రత్యేక ద్రవ్య లభ్యత పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించామని గత నెల 27న ఆర్బీఐ ప్రకటించింది.
- ఆర్థిక వ్యవస్థలో రూ.25 కోట్లను విడుదల చేయడం ద్వారా రూ.లక్ష కోట్ల టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో ఆపరేషన్ (టీఎల్‌టీఆర్‌వో అంటే ఆర్థిక వ్యవస్థలో నగదు లభించేలా చేయడం) నాలుగో, తుది విడత కార్యక్రమాన్ని నిర్వహించామని ఏప్రిల్ 17న ఆర్బీఐ తెలిపింది. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు రీఫైనాన్స్ పథకం ద్వారా 50 వేల కోట్లను కేటాయించింది.
- వివిధ ఉద్దీపన చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో రూ.3.74 లక్షల కోట్ల నిధులను విడుదల చేస్తామని మార్చి 27న ఆర్బీఐ ప్రకటించింది. ఫిబ్రవరి నుంచి మార్చి 27 మధ్య వివిధ పథకాల ద్వారా మార్కెట్‌లో రూ.2.8 లక్షల కోట్ల నిధులను ఆర్బీఐ విడుదల చేసింది.