చెన్నైలో జూన్ 19 నుంచి లాక్‌డౌన్ నేపథ్యంలో ఓలా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-06-19T01:32:36+05:30 IST

తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో జూన్ 19 నుంచి తిరిగి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు...

చెన్నైలో జూన్ 19 నుంచి లాక్‌డౌన్ నేపథ్యంలో ఓలా కీలక ప్రకటన

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం చెన్నైలో జూన్ 19 నుంచి తిరిగి లాక్‌డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో అత్యవసర సేవల నిమిత్తం క్యాబ్‌లను అందుబాటులో ఉంచనున్నట్లు ఓలా ప్రకటించింది. విమానాశ్రయానికి, రైల్వే స్టేషన్లకు వెళ్లేవారి కోసం, వచ్చే వారి కోసం క్యాబ్‌లను నడపనున్నట్లు తెలిపింది. ‘ఓలా ఎమర్జన్సీ’ పేరుతో క్యాబ్ సర్వీసులు యాప్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేసింది. చెన్నైలోని 350 హాస్పిటల్స్ నుంచి కూడా ఓలా క్యాబ్ సేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.


మెడికల్ ఎమర్జన్సీ సమయంలో ప్రైవేట్ వాహనాలకు అధిక మొత్తంలో చెల్లించలేని వారికి ఓలా క్యాబ్ సేవలు కొంత ఊరట కలిగించనున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండేందుకు క్యాబ్ డ్రైవర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని ఓలా హామీ ఇచ్చింది. లాక్‌డౌన్ కొత్త నిబంధనల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం రవాణాకు సంబంధించి కొన్ని మినహాయింపులను తాజాగా ప్రకటించింది. ప్రీ-పెయిడ్ ఆటోలకు, ట్యాక్సీలకు, ప్రైవేట్ వాహనాలకు ప్రయాణికులను విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల నుంచి తీసుకొచ్చేందుకు, చేర్చేందుకు అనుమతినిచ్చింది. అయితే.. ఈ వాహనాలకు ప్రభుత్వం ఈ-పాస్‌లను జారీ చేయనుంది.

Updated Date - 2020-06-19T01:32:36+05:30 IST