ముడి చమురు ధరల్లో భారీ పతనం ... నీటి కన్నా చౌకగా....

ABN , First Publish Date - 2020-04-21T11:14:45+05:30 IST

ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి: యుఎస్ చమురు మార్కెట్ ను కరోనా అంటువ్యాధి దెబ్బతీసింది. న్యూయార్క్ లో బాటిల్ వాటర్ కంటే ముడి చమురు చౌకగా మారిపోయింది.

ముడి చమురు ధరల్లో భారీ పతనం ... నీటి కన్నా చౌకగా....

న్యూయార్క్: ముడి చమురు ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. యుఎస్ చమురు మార్కెట్ ను కరోనా అంటువ్యాధి దెబ్బతీసింది. న్యూయార్క్ లో బాటిల్ వాటర్ కంటే ముడి చమురు చౌకగా మారిపోయింది. ఈ ముడి చమురు ధరల తగ్గింపు మే నెల నుండి అందుబాటులోకి వస్తుంది. చమురు ధరలు కనిష్ట స్థాయిలో దిగజారడంతో మే నెలలో బ్యారెల్ 1.50 డాలర్లకు లభించనుంది. ఒక్క రోజులో ముడి చమురు ధరలు 90 శాతం మేరకు పడిపోయాయి. మే నెలలో ముడి చమురు సరఫరాకు సంబంధించిన ఒప్పందం ఏప్రిల్ 21 తో ముగుస్తుంది. అయితే ఇంతవరకు ముడి చమురు కొనుగోలుదారులు ముందుకు రాలేదు. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. న్యూయార్క్‌లోని యుఎస్ బెంచ్‌మార్క్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ మే నెలలో 301.97 శాతం మేరకు ముడి చమురు ఒప్పందాలను కోల్పోయింది. బ్యారెల్ కు 36.90 డాలర్లుగా నిలిచిపోయింది. మే నెలలో సరఫరా చేయబోయే ముడి చమురు ధరలు బ్యారెల్ కు  గరిష్టంగా 85 17.85, కనిష్టంగా 37.63 డాలర్లు పలుకుతున్నాయి. మార్కెట్ చివరిలో  బ్యారెల్ కు 37.63 వద్ద ముగిసింది. న్యూయార్క్‌లో ముడి చమురు ధరలు ఇంతగా దిగజారడం ఇదే మొదటిసారి. మే నెలలో ముడి చమురు సరఫరా కోసం కుదుర్చున్న ఒప్పందాలు ఇప్పుడు ప్రతికూలంగా మారాయి. చమురు అమ్మకందారులు ప్రపంచ దేశాలను చమురు కొనుగోలు చేయాలని అడుగుతున్నారు. కానీ ఎవరూ ముందుకు రావడంలేదు. వారి దేశాల్లోని జనాభా  లాక్ డౌన్ లో ఉండడంతో  చమురు కొనుగోలు చేయడంలేదు. వారి దగ్గర చమురు నిల్వలు ఇంకా ఉన్నాయి. కొత్తగా చమురు కొనుగోలు చేస్తే నిల్వ చేయడానికి స్థలం లేదు. అందుకే వారు చమురు కొనుగోలు చేయడంలేదు. 

Updated Date - 2020-04-21T11:14:45+05:30 IST