200 మంది పోలీసులను విచారిస్తున్న అధికారులు
ABN , First Publish Date - 2020-07-08T06:53:36+05:30 IST
గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ముఠాకు సమాచారం అందించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు 200 మందికి పైగా పోలీసులను విచారిస్తున్నారు. వీరంతా చౌబేపూర్, బిహౌర్, కాక్వాన్, శివరాజ్‌పూర్‌తో పాటు...
- దూబేకు సమాచారం అందించారన్న ఆరోపణలు
కాన్పూర్, జూలై 7: గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ముఠాకు సమాచారం అందించారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు 200 మందికి పైగా పోలీసులను విచారిస్తున్నారు. వీరంతా చౌబేపూర్, బిహౌర్, కాక్వాన్, శివరాజ్‌పూర్‌తో పాటు మరికొన్ని పోలీస్ స్టేషన్లకు చెందిన వారని అధికారులు చెప్పారు. ఇప్పటికే ఈ కేసులో 10 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన వికాస్ దూబే ముఠా ఆచూకీ కోసం గాలిస్తున్న పోలీసులు మంగళవారం మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు.