కరోనాను జయించి.. అందరికీ ధైర్యం చెబుతూ..

ABN , First Publish Date - 2020-04-05T23:13:13+05:30 IST

‘ఎవరూ భయపడకండి. ప్రస్తుత పరిస్థితి గురించి ఎవరూ అందోళన చెందకండి’ అంటూ ఒడిషా మొదటి...

కరోనాను జయించి.. అందరికీ ధైర్యం చెబుతూ..

భువనేశ్వర్: ‘ఎవరూ భయపడకండి. ప్రస్తుత పరిస్థితి గురించి ఎవరూ అందోళన చెందకండి’ అంటూ ఒడిషా మొదటి కరోనా బాధితుడు ఓ వీడియో సందేశాన్ని పంపాడు. ఇటలీలోని మిలన్ యూనివర్సిటీలో రీసెర్చ్ స్కాలర్ అతడు. తన రీసెర్చ్‌ కోసం భువనేశ్వర్ వచ్చాడు. అయితే తాను కరోనా బారిన పడినట్లు తెలుసుకున్నాడు. ఒడిషా రాష్ట్రంలో అతడే మొడటి కరోనా పేషెంట్. నగరంలోని క్యాపిటల్ హాస్పటల్‌లో చికిత్స పొందిన తరువాత ఏప్రిల్ 3న డిశ్చార్జ్ అయ్యాడు. దీంతో తనకు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్లకు కృతజ్ఞతలు చెబుతూ ఓ వీడియోను పంపించాడు. సర్జికల్ మాస్క్ వేసుకుని వీడియో చేసిన అతడు తనకు చికిత్స చేసిన డాక్టర్లందరికీ కృతజ్ఙతలు చెప్పాడు. 


ట్రీట్‌మెంట్ పూర్తయినా మరో 14 రోజులు హోం క్వారెంటైన్‌లో ఉండాల్సిందిగా తనకు డాక్టర్లు సూచించారని, చల్లటి పదార్థాలు తినవద్దన్నారని, ఈ క్వారంటైన్ సయమంలో ఎలాంటి అవసరం ఉన్నా తమకు కాల్ చేయమని డాక్టర్లు సూచించారని అతడు చెప్పాడు. 


ఇదిలా ఉంటే అతడికి సన్నిహింతంగా ఉన్న తండ్రిని, వంటవాడిని కూడా డాక్టర్లు తొలుత ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. అయితే వారికి కరోనా నెగెటివ్ రావడంతో కొన్ని రోజులు క్వారంటైన్‌లో ఉంచి విడుదల చేశారు.

Updated Date - 2020-04-05T23:13:13+05:30 IST