ఆ 62 మంది ఎక్కడ?: యూకే నుంచి వచ్చిన వారి కోసం గాలింపు!

ABN , First Publish Date - 2020-12-29T05:22:29+05:30 IST

ఆ 62 మంది ఎక్కడ?: యూకే నుంచి వచ్చిన వారి కోసం గాలింపు!

ఆ 62 మంది ఎక్కడ?: యూకే నుంచి వచ్చిన వారి కోసం గాలింపు!

భువనేశ్వర్: కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ విజృంభిస్తున్న నేపథ్యంలో యూకే నుంచి వచ్చిన దాదాపు 62 మంది జాడ ప్రస్తుతం తెలియరాలేదని ఒడిశా ప్రభుత్వం వెల్లడించింది. కరోనా కొత్త స్ట్రెయిన్ నిలువరించేందుకు ప్రభుత్వం స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ వీరంతా పత్తాలేకుండా పోయినట్టు సమాచారం. నవంబర్ 30 నుంచి ఈ నెల 21 వరకు యూకే నుంచి దాదాపు 181 మంది ప్రయాణికులు ఒడిశాకు తిరిగి వచ్చారు. వీరిలో 62 మంది ప్రస్తుతం ఎక్కడున్నారో తెలియడం లేదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ నిరంజన్ మిశ్రా పేర్కొన్నారు. ‘‘119 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించారు. వీరిలో కేవలం ఆరుగురికి మాత్రమే పాజిటివ్ వచ్చింది. మరో 62 మంది కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదు. తమను గుర్తించడానికి వీలు లేకుండా వారంతా తప్పుడు సమాచారం ఇచ్చి ఉండవచ్చునని భావిస్తున్నాం...’’ అని డాక్టర్ మిశ్రా పేర్కొన్నారు. అయితే వీరంతా 14 రోజుల పాటు ఐసోలేషన్‌కు వెళ్లడం కొంత ఊరట కలిగించే విషయమని ఆయన తెలిపారు. 

Updated Date - 2020-12-29T05:22:29+05:30 IST