వ్యాపార సంస్థలను తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం అనుమతి

ABN , First Publish Date - 2020-04-26T02:28:39+05:30 IST

ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త అష్ట దిగ్బంధనం అమల్లో ఉన్న సమయంలో

వ్యాపార సంస్థలను తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం అనుమతి

భువనేశ్వర్ : ఒడిశా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త అష్ట దిగ్బంధనం అమల్లో ఉన్న సమయంలో వ్యాపార సంస్థలు, దుకాణాలను తెరిచేందుకు అనుమతించింది. కేంద్ర ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు, దుకాణాలను తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అనంతరం ఒడిశా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. 


నివాస ప్రాంతాలు, మార్కెట్ సముదాయాల్లో ఉండే మల్టీ బ్రాండ్, సింగిల్ బ్రాండ్ మాల్స్ మినహా మిగిలిన వ్యాపార సంస్థలు, దుకాణాలను తెరచి ఉంచి, వ్యాపారాలు చేయడానికి అనుమతిస్తున్నట్లు ఒడిశా రెవిన్యూ, విపత్తు నిర్వహణ శాఖ జారీ చేసిన ఆదేశాలు పేర్కొన్నాయి. 


ఒరిస్సా షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్, 1956 ప్రకారం నమోదైన, నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల పరిథిలోని  వ్యాపార సంస్థలు, దుకాణాలను వ్యాపారం కోసం తెరవవచ్చునని ఈ ఆదేశాలు పేర్కొన్నాయి. 


అయితే వ్యాపార సంస్థలు, దుకాణాల నిర్వాహకులు అష్ట దిగ్బంధనం నేపథ్యంలో పాటించవలసిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నాయి. పరస్పర దూరం పాటించడం, ముఖానికి మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వాడటం వంటివాటితోపాటు, దుకాణాలలో 50 శాతం మించకుండా సిబ్బంది పని చేయాలని పేర్కొన్నాయి.


Updated Date - 2020-04-26T02:28:39+05:30 IST