‘అమ్మా... అమ్మా... నీ పసివాణ్ణమ్మా...’ ఆ వైద్యునికి సలాం!

ABN , First Publish Date - 2020-03-24T12:52:50+05:30 IST

భారత్‌లో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలు సినిమా థియేటర్లు, మాల్స్ బంద్ అయ్యాయి.

‘అమ్మా... అమ్మా... నీ పసివాణ్ణమ్మా...’ ఆ వైద్యునికి సలాం!

సంబల్‌పూర్: భారత్‌లో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. స్కూళ్లు, కాలేజీలు సినిమా థియేటర్లు, మాల్స్ బంద్ అయ్యాయి. పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతులు లభించాయి. అయితే వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు అంకితభావంతో తమ విధులను నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒడిశాకు చెందిన ఒక వైద్యుడు అందరికీ ఉదాహరణగా నిలిచాడు. తల్లి చనిపోయిన రోజునే విధులకు హాజరై, పనిపట్ల తనకున్న అంకితభావాన్ని ప్రదర్శించారు. వివరాల్లోకి వెళితే ఒడిశాలోని సంబల్‌పూర్‌కు చెందిన అసిస్టెంట్ డివిజినల్ వైద్య అధికారి డాక్టర్ అశోక్‌దాస్ తల్లి పద్మిని దాస్ మృతి చెందారు. ఇటువంటి పరిస్థితులలోనూ దు:ఖాన్ని దిగమింగుకుని డాక్టర్ అశోక్ దాస్ అదేరోజు ఆసుపత్రి విధులకు హాజరయ్యారు. సంబల్‌పూర్ జిల్లాలో నోడల్ అధికారిగా పనిచేస్తున్న ఆయన ప్రజలలోకి వెళ్లి దేశవ్యాప్తంగా ప్రభలుతున్న కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నారు. తల్లి చనిపోయిన రోజున తన ఆసుపత్రి విధులను ముగించుకున్నాక ఇంటికి వెళ్లి తల్లి కర్మకాండలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ అశోక్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో తనకు సెలవు కన్నా విధులు నిర్వహించడమే ముఖ్యమన్నారు.

Updated Date - 2020-03-24T12:52:50+05:30 IST