కరోనా ఎఫెక్ట్: ఒడిశా సీఎం సంచలన ఆదేశాలు..

ABN , First Publish Date - 2020-03-13T18:06:35+05:30 IST

ప్రాణాంతక నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్-19) రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో...

కరోనా ఎఫెక్ట్: ఒడిశా సీఎం సంచలన ఆదేశాలు..

న్యూఢిల్లీ: ప్రాణాంతక నోవెల్ కరోనా వైరస్ (కోవిడ్-19) రోజు రోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31 వరకు అన్ని పాఠశాలలు, కాలేజీలు మూసివేయాలనీ.. పరీక్షలు నిర్వహించడం మినహా మరెలాంటి కార్యక్రమాలు నిర్వహించరాదని ఆయన పేర్కొన్నారు. ఇవాళ అసెంబ్లీ వేదికగా ఆయన మాట్లాడుతూ...  ‘‘ ఈ నెల 31 వరకు అన్ని విద్యాసంస్థలను మూసివేయాలి.  పరీక్షలు నిర్వహించడానికి తప్ప పాఠశాలలను తెరవొద్దు. మార్చి 31 వరకు  స్విమ్మింగ్ పూళ్లు, జిమ్‌లు కూడా మూసివేయాలి..’’ అని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2020-03-13T18:06:35+05:30 IST