ఒడిశా బీజేపీ అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్

ABN , First Publish Date - 2020-09-14T19:55:45+05:30 IST

ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ మొహంతీకి కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఇక్కడి ఎయిమ్స్‌లో..

ఒడిశా బీజేపీ అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్

భువనేశ్వర్: ఒడిశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీర్ మొహంతీకి కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఇక్కడి ఎయిమ్స్‌లో సోమవారంనాడు చేర్చారు. తనంత తానుగా చేయించుకున్న వైద్య పరీక్షలు కరోనా పాజిటివ్ వచ్చినట్టు మొహంతి తెలిపారు. ప్రస్తుతం తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు చెప్పారు. ఇటీవల కాలంలో తనకు కలవడానికి వచ్చిన వ్యక్తులు కూడా వైద్య పరీక్షలు చేయించుకుని, ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు. ప్రస్తుతం తాను బాగానే ఉన్నప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. ఒడిశాలో ప్రస్తుత కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,50,807కు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

Updated Date - 2020-09-14T19:55:45+05:30 IST