అగ్రరాజ్యం పనితీరుపై మాజీ అధ్యక్షుడి విమర్శలు

ABN , First Publish Date - 2020-05-18T02:21:46+05:30 IST

కరోనా మహమ్మారి విషయంలో అగ్రరాజ్యం అమెరికా స్పందించిన తీరు సరిగాలేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు.

అగ్రరాజ్యం పనితీరుపై మాజీ అధ్యక్షుడి విమర్శలు

వాషింగ్టన్: కరోనా మహమ్మారి విషయంలో అగ్రరాజ్యం అమెరికా స్పందించిన తీరు సరిగాలేదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విమర్శించారు. అధికారంలో ఉన్న వారు కనీసం తమ బాధ్యతలు తెలిసినట్లు కూడా ప్రవర్తించలేదని మండిపడ్డారు. ‘పదవుల్లో ఉన్న వారికి ఏం చేయాలో తెలుసని ప్రజలంతా భావించారు. ఈ మహమ్మారి వచ్చిన తర్వాత ఆ అపోహలన్నీ తొలగిపోయాయి. పదవుల్లో ఉన్న వారికి ఏమీ తెలియదనే విషయం తేటతెల్లమయింది’ అంటూ ప్రభుత్వంపై ఒబామా విమర్శల వర్షం కురిపించారు.

Updated Date - 2020-05-18T02:21:46+05:30 IST